Home Entertainment అక్కడ డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచినా #RRR ..ఇది నిజంగా ఎవ్వరు ఊహించనిది

అక్కడ డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచినా #RRR ..ఇది నిజంగా ఎవ్వరు ఊహించనిది

0 second read
0
1
12,803

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎంత పెద్ద హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ టీఆర్పీ రేటింగుల్లో మాత్రం డిజాస్టర్‌గా నిలిచిందనే చెప్పాలి. గత వారం జీ తెలుగులో హిందీ వెర్షన్ సినిమాను ప్రసారం చేయగా కేవలం 4.6 టీఆర్పీ రేటింగ్ మాత్రమే నమోదైంది. తొలిసారి ప్రసారంలో ఓ బ్లాక్ బస్టర్ మూవీ ఇంత తక్కువ రేటింగ్ నమోదు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే హిందీ వెర్షన్ కదా అని కొట్టిపారేయవచ్చు. గతంలో జీ తెలుగు ఛానల్ షారుఖ్ ఖాన్ నటించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ మూవీని కూడా ప్రసారం చేసింది. అయితే ఆ సినిమా మంచి టీఆర్పీ రేటింగ్‌ను నమోదు చేసింది. అటు తెలుగు వెర్షన్ స్టార్ మా టీవీలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం కాగా కేవలం 19.62 రేటింగ్ మాత్రమే వచ్చింది. ఇప్ప‌టివ‌ర‌కు టాలీవుడ్‌లో అల వైకుంఠ‌పుర‌ములో 29.4 టీఆర్‌పీ రేటింగ్స్ తో టాప్ ప్లేస్‌లో ఉంది. ఆ త‌ర్వాతి స్థానాల్లో స‌రిలేరు నీకెవ్వ‌రు, బాహుబ‌లి, శ్రీమంతుడు, పుష్ప ఉన్నాయి.

ఈ నేపథ్యంలో బుల్లితెర టీఆర్పీ రేటింగ్స్ విషయంలో ఆర్.ఆర్.ఆర్ సినిమాకు టాప్ టెన్ జాబితాలో చోటు దక్కలేదు. టాప్ టెన్‌లో ఆర్ఆర్ఆర్ మూవీకి చోటు ద‌క్క‌లేదు. ఫిదా, గీతాగోవిందం కంటే ఆర్ఆర్ఆర్‌కు త‌క్కువ టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా‌, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ అల్లూరి సీతారామ‌రాజుగా అలరించారు. వీరి పాత్ర‌ల‌కు ఫిక్ష‌న‌ల్ అంశాల‌ను జోడిస్తూ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఆర్ఆర్ఆర్ సినిమాను రాజ‌మౌళి తెర‌కెక్కించారు. ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ యాక్టింగ్‌తో పాటు రాజ‌మౌళి టేకింగ్‌, వీరోచిత‌మైన యాక్ష‌న్ స‌న్నివేశాలు థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల్ని అల‌రించాయి. వ‌ర‌ల్డ్‌వైడ్‌గా దాదాపు 1200 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ రేసులో నిలిచే అవ‌కాశం ఉన్న‌ట్లు హాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

థియేటర్లలో బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టిన ఆర్.ఆర్.ఆర్ మూవీ ప్రపంచం నలుమూలల నుండి విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పుడు జపాన్‌లో విడుదల కానుంది. బెస్ట్ ఎవర్ ఇండియన్ మల్టీ స్టారర్ సినిమాను జపనీయులు కోసం జపాన్‌లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా జపాన్ వర్షన్‌లో అక్టోబర్ 21న గ్రాండ్‌గా రిలీజ్ అవ్వబోతుంది. దర్శకుడు రాజమౌళి జపాన్‌లో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం కోసం తనవంతు కృషి చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఈ సినిమా ప్రొమోషన్స్ స్టార్ట్ చేశారు. మరి ఈ సినిమా అక్కడ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో తెలియదు. కానీ ప్రొమోషన్స్ మాత్రం అక్కడ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రాజమౌళి కూడా ప్రత్యేకంగా జపాన్ మీడియాతో ప్రొమోషన్‌లలో పాల్గొంటూ సందడి చేస్తున్నాడు. తాజాగా జపాన్ మీడియా కోసం జక్కన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ మూవీలో రామ్ చరణ్, ఎన్టీఆర్‌కు జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హిందీ నటి ఆలియా భట్ నటించారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్ దేవ్‌గణ్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించాడు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…