
మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం వచ్చే నెల సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే..తెలుగు తో పాటుగా హిందీ లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారట..ఈ సినిమాలో చిరంజీవి తో పాటుగా మాస్ మహారాజ రవితేజ కూడా నటించాడు..ఆయన ఇందులో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు..ఇటీవలే ఆయనకి సంబంధించిన టీజర్ విడుదల చెయ్యగా అభిమానుల నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో అందరం చూసాము..విక్రమార్కుడు తర్వాత అలాంటి పవర్ ఫుల్ పాత్రని రవితేజ కోసం రాసాడు ఆ చిత్ర దర్శకుడు బాబీ..ఇక మెగాస్టార్ చిరంజీవి రౌడీ షీటర్ పాత్ర పోషించాడు..ఇంత మాస్ గా మెగాస్టార్ చిరంజీవి ని చూసి చాలా ఏళ్ళు అయ్యింది..రీ ఎంట్రీ తర్వాత పర్ఫెక్ట్ కం బ్యాక్ సినిమా ఇదే అవుతుందని మెహ అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.
ఇక ఈ సినిమాకి సంబంధించిన ఒక చిన్న ప్రెస్ మీట్ నిన్న ‘వాల్తేరు వీరయ్య’ సెట్స్ లోనే నిర్వహించారు..ఈ ప్రెస్ మీట్ కి చిరంజీవి మరియు రవితేజ తో పాటు సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరు హాజరయ్యారు..ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘నా అభిమానులు నా నుండి ఎలాంటివి అయితే కోరుకుంటారో అవన్నీ ఈ సినిమాల ఉంటాయి..శంకర్ దాదా MBBS చిత్రం తర్వాత నేను ఆ రేంజ్ కామెడీ చేసింది ఈ సినిమాలోనే..కచ్చితంగా అభిమానులను అది అలరిస్తుందని ఆశిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు..ఆ తర్వాత మిగిలిన నటీనటుల గురించి మాట్లాడాడు కానీ, రవితేజ గురించి మాత్రం తక్కువే మాట్లాడాడు..దీనితో చిరంజీవి ఎందుకో నా తమ్ముడు రవితేజ గురించి తక్కువ మాట్లాడాను అని వెలతి గా అనిపించింది..అందుకే నేను ప్రత్యేకంగా ట్విట్టర్ లో ట్వీట్ వేస్తున్నాను అంటూ చిరంజీవి ఒక ట్వీట్ వేసాడు.
తమ అభిమాన హీరో గురించి మాట్లాడకపొయ్యేసరికి ఫ్యాన్స్ రవితేజ కాస్త హర్ట్ అయ్యారు..అంతే కాకుండా మూవీ లో పని చేసిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు కూడా ఇది కేవలం చిరంజీవి సినిమా మాత్రమే అన్నట్టుగా ప్రాజెక్ట్ చేసారు..ఈ చిత్రం లో రవితేజ 40 నిమిషాల నిడివి ఉన్న పాత్ర చేసాడు..అంటే దాదాపుగా హీరో తో సమానం అన్నమాట..అయినా కూడా అతని గురించి తక్కువగా మాట్లాడి చిరంజీవి సినిమా లాగానే ట్రీట్ చేసిన విధానం ఆయన ఫ్యాన్స్ కి నచ్చలేదు..రవితేజ ఎమన్నా చిన్న హీరో అనుకుంటున్నారా..అతను యావరేజి సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర దున్నేస్తాయి..రీసెంట్ ఉదాహరణ ధమాకా సినిమానే అంటూ వాల్తేరు వీరయ్య టీం పై విరుచుకుపడుతున్నారు.