
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా బాక్సాఫీస్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ రికార్డులు కైవసం చేసుకోవడంలోనూ అదే విధంగా దూసుకుపోతోంది. అవార్డుల పంట పండిస్తోంది. ఒక అవార్డు తర్వాత మరోటి తన ఖాతాలో వేసుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమాకు ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులను దక్కించుకుంది. దీంతో పాటు మరో హాలీవుడ్ అవార్డును కూడా కైవసం చేసుకుంది. దీంతో చిత్ర యూనిట్ ఆనందంలో మునిగి తేలుతుంది.
గతంలో ‘సన్ సెట్ సర్కిల్ అవార్డ్స్’లో ‘ఆర్ఆర్ఆర్’ రెండు కేటగిరీల్లో అవార్డులను దక్కించుకున్న విషయం తెలిసిందే. సన్ సెట్ సర్కిల్ అవార్డ్స్ లో హాలీవుడ్ లోని నాలుగు సినిమాలతో ఆర్ఆర్ఆర్ నాలుగు విభాగాల్లో పోటీ పడింది. అందులో రెండు విభాగాల్లో అవార్డులు దక్కించుకోగా ఉత్తమ దర్శకుడి విభాగంలో రాజమౌళి రన్నరప్ గా నిలిచారు. సన్ సెట్ సర్కిల్ అవార్డ్స్ లో రాజమౌళికి తొలి అవార్డు దక్కింది. దీంతో పాటు ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ అవార్డును కూడా ఇది ఎగరేసుకుపోయింది.
ఆర్ఆర్ఆర్ కు హాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్స్ నుంచి మంచి గుర్తింపు లభించింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డును తన ఖాతాలో వేసుకుంది ఆర్ఆర్ఆర్. 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు గానూ ఆర్ఆర్ఆర్ రెండు నామినేషన్లను సాధించింది. ‘నాన్ ఇంగ్లిష్ లాంగ్వెజ్’లో ఉత్తమ చిత్రంగా నామినేట్ అయ్యింది. ఈ చిత్రంలోని ‘నాట నాటు, నాటు నాటు’ పాటకు సంబంధించి ‘బెస్ట్ ఒరిజినల్ మోషన్ పిక్చర్’ కేటగిరీలో నామినేట్ అయ్యింది. దీంతో రెండు విభాగాలకు గానూ గోల్డెన్ గ్లోబ్ అవార్డులను దక్కించుకుంది.
ఈ చిత్రాన్ని ఆస్కార్ బరిలో నిలపాలని రాజమౌళి తపిస్తున్నారు. ఇప్పటి వరకూ ఇండియాకు ఒక్క ఏఆర్ రహెమాన్ కు మాత్రమే బెస్ట్ సాంగ్ మ్యూజిక్ కంపోజర్ గా ఆస్కార్ అవార్డు దక్కింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కూడా ఆస్కార్ అవార్డును దక్కించుకుంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ర్టీ ప్రపంచంలో మేటిగా నిలుస్తుందని సీని అభిమానులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ తో బోనీ కొట్టాలని తెలుగు ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ భారత సినీ పరిశ్రమ ఆస్కార్ కు ఈ చిత్రాన్ని మాత్రం పంపలేదు. దీంతో రాజమౌళి సొంతంగా నిమినేట్ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిత్రం కూడా ఆస్కార్ బరిలో నిలిచి ఉత్తమ చిత్రంగా రాణించాలని ఇండియన్స్ కోరుకుంటున్నారు.