Home Entertainment అంటే సుందరానికి మూవీ 3 రోజుల వసూళ్లు ఎక్సక్లూసివ్ గా మీకోసం

అంటే సుందరానికి మూవీ 3 రోజుల వసూళ్లు ఎక్సక్లూసివ్ గా మీకోసం

0 second read
0
0
4,473

న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన అంటే సుందరానికి సినిమా ఇటీవలే విడుదల అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది..రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ద్వారా చాలా కాలం తర్వాత నాని తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో నవ్వించాడు..అదే సమయం లో తన అద్భుతమైన ఎమోషనల్ యాక్టింగ్ తో కంటతడి కూడా పెట్టించాడు..రొమాంటిక్ కోయండి ఎంటెర్టైనెంట్ సినిమాలు తియ్యడం లో ఎంతో మందికి రోల్ మోడల్ గా మారిన నాని..తానూ జానర్ లో ఎంత పర్ఫెక్ట్ అనేది ఈ సినిమా ద్వారా మరోసారి అందరికి చూపించాడు..ఇక చాలా కాలం తర్వాత మలయాళం బ్యూటీ నాజ్రియా ఈ సినిమా ద్వారా గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చింది..వీల్లిదరి జంట ఆన్ స్క్రీన్ మీద ఎంతో చూడముచ్చటగా అనిపించింది అనే చెప్పాలి..ఇక నాని తండ్రి పాత్ర లో నరేష్ కూడా అద్భుతంగా నటించాడు..ఇలా ఈ సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరు ఎంతో సహజంగా నటించి సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లారు..ఇది కాసేపు పక్కన పెడితే ఈ సినిమా మూడు రోజుల వసూళ్ల గురించి కాసేపు మాట్లాడుకుందాం.

మొదటి రోజు ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ఓపెన్ అయ్యినప్పటికీ కూడా..ఎందుకో ఆసీమ్హిన స్థాయి వసూళ్లు మాత్రం రాలేదు..అతి తక్కువ రేట్స్ మీద విడుదల అయిన నాని గత చిత్రం శ్యామ్ సింగ రాయ్ దాదాపుగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలకు కలిసి 5 కోట్ల రూపాయిల షేర్ ని సొంతం చేసుకుంది..కానీ అంటే సుందరానికి సినిమా మాత్రం మొదటి రోజు కనీసం నాలుగు కోట్ల రూపాయిల వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది..ఇది నాని కెరీర్ లో వరస్ట్ ఓపెనింగ్ గా మనం చెప్పుకోవచ్చు..టీజర్ ట్రైలర్ కూడా బాగానే ఉన్నప్పటికీ ఎందుకో వసూళ్లు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు..ఇక రెండవ రోజు మూడవ రోజు కూడా డీసెంట్ వసూళ్లను ఒంతం చేసుకున్న ఈ చిత్రం..బ్రేక్ ఈవెన్ కి సరిపడ వసూళ్ల ట్రెండ్ ని మాత్రం కొనసాగించలేకపోయింది..ఈ సినిమాని ప్రపంచవాప్తంగా దాదాపుగా 30 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకుంది..మూడు రోజులకు గాను ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలకు కలిపి 12 కోట్ల రూపాయిలు..అలాగే కర్ణాటక మరియు ఓవర్సీస్ ప్రాంతాలకు కలిపి 4 కోట్ల రూపాయిలు..మొత్తం మీద ప్రపంచవాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి 16 కోట్ల రూపాయిల షేర్ ని సొంతం చేసుకుంది..వసూళ్లు డీసెంట్ అయ్యినప్పటికీ కూడా ఇది నాని రేంజ్ వసూలు కావు అనే చెప్పాలి.

బ్రేక్ ఈవెన్ మార్కుని ఈ సినిమా అందుకోవాలి అంటే కచ్చితంగా రేపటి నుండి డీసెంట్ హోల్డ్ ని సాధించాలి..లేకపోతే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం చాలా కష్టం అని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న మాట..నాని కి ఫామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉండడం..అంతే కాకుండా మరో వారం పాటు ఏ సినిమా కూడా విడుదల లేకపోవడం.అంటే సుందరానికి కలిసి వచ్చిన అంశాలు..కానీ దీనికంటే ముందుగా వచ్చిన కమల్ హాసన్ విక్రమ్ సినిమా జోరు ఏ మాత్రం కూడా తగ్గలేదు..ఆ సినిమా ప్రభావం దీనిపై గట్టిగ పడుతుంది అనే చెప్పాలి..ఈ వీకెండ్ లో కూడా కొన్ని చోట్ల అంటే సుందరానికి సినిమాకంటే ఎక్కువగా విక్రమ్ సినిమాకే ఫుల్స్ పడ్డాయి..ఆ సినిమా విద్వాంసం సృష్టిస్తున్న ఈ సమయంలో అంటే సుందరానికి సినిమా విడుదల అవ్వడం బాడ్ లక్ అని అంటున్నారు ట్రేడ్ పండితులు..అంతే కాకుండా ఈ ఏడాది వరుసగా సూపర్ హిట్ సినిమాలకు జనాలు టికెట్స్ కొని భారీగా ఖర్చు చేసారు..దాని ప్రభావం కూడా ఈ సినిమా మీద పది ఉండొచ్చు అని తెలుస్తుంది..ఏది ఏమైనా డీసెంట్ ఓపెనింగ్ వీకెండ్ ని సాధించిన అంటే సుందరానికి సినిమా..ఫుల్ రన్ లో ఎంత వసూలు చెయ్యబోతుందో చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…