Home Entertainment అంటే సుందరానికి మూవీ క్లోసింగ్ కలెక్షన్స్ ఎక్సక్లూసివ్ గా మీకోసం

అంటే సుందరానికి మూవీ క్లోసింగ్ కలెక్షన్స్ ఎక్సక్లూసివ్ గా మీకోసం

1 second read
0
0
1,147

న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన అంటే సుందరానికి సినిమా ఇటీవలే విడుదలఅయ్యి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి మన అందరికి తెలిసింది..కామెడీ పరంగాను మరియు ఎమోషన్స్ పరంగాను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలా కాలం తర్వాత వచ్చిన ఒక్క సంపూర్ణమైన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాకి మొదటి రోజు మొదటి ఆట నుండే అద్భుతమైన టాక్ వచ్చింది..కానీ నాని కి శని దేవుడు కనికరం చూపించినట్టు లేదు..మంచి టాక్ ఉన్నపటికీ కూడా ఈ సినిమా మొదటి రోజు నుండి ఆశించిన స్థాయి వసూళ్లను రాబట్టలేక చతికల పడింది..ఓపెనింగ్ వీకెండ్ పర్వాలేదు అనిపించగా..నాని కి ఉన్న ఫామిలీ ఆడియన్స్ ఫాన్స్ సపోర్టు తో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలుస్తుందేమో అని ఆశపడ్డారు..కానీ వారి ఆశలను ఈ సినిమా నీరు గార్చింది..మొదటి వీకెండ్ తర్వాత ఈ సినిమాకి కనీసం రెండు కోట్ల రూపాయిలు కూడా రాలేదు..నాని నుండి వస్తున్నా రొమాంటిక్ కమెడీ ఎంటర్టైనర్ సినిమా అవ్వడం తో ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల రూపాయలకు వివిధ ప్రాంతాల నుండి కొనుగోలు చేసారు డిస్ట్రిబ్యూటర్లు..మొత్తం మీద ఫుల్ రన్ లో ఈ సినిమా అన్ని ప్రాంతాలకు కలిపి ఎంత వసూలు చేసిందో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.

మొదటి రోజు ఈ సినిమాకి ఉన్న బజ్ కి బయ్యర్లు రెండు తెలుగు రాష్ట్రాల నుండి 7 కోట్ల రూపాయిల షేర్ వస్తుందని అంచనా వేశారు..కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈ సినిమా కనీసం నాలుగు కోట్ల రూపాయిల షేర్ ని కూడా దక్కించుకోలేక పోయింది..ఇక రెండవ రోజు మూడవ రోజు మొదటి రోజుతో పోలిస్తే కలెక్షన్స్ తగ్గలేదు..అలా అని పెరగలేదు కూడా..మూడు రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపుగా 15 కోట్ల రూపాయిల షేర్ ని సాధించింది..టాక్ ఉంది కాబట్టి ఇదే రేంజ్ ఫ్లో ని కొనసాగిస్తుంది అని ట్రేడ్ పండితులు అంచనా వేశారు..కానీ నాల్గవ రోజు నుండి ఈ సినిమా కి డిజాస్టర్ ఫ్లాప్ రేంజ్ లో కలెక్షన్స్ డ్రాప్ అయ్యిపోయాయి..మొదటి వారం లో చివరి నాలుగు రోజులు ఈ సినిమా కేవలం 2 కోట్ల రూపాయిల షేర్ ని మాత్రమే వసూలు చేసింది..వారం ముగియకముందే క్లోసింగ్ రేంజ్ కి పడిపోవడం తో బయ్యర్లు రెండవ వీకెండ్ పై ఆశలు వదిలేసుకున్నారు..దీనితో ఈ సినిమా క్లోసింగ్ కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా కలిపి కేవలం 19 కోట్ల రూపాయిలు మాత్రమే వసూలు చేసింది..అంటే బయ్యర్లకు దాదాపుగా 11 కోట్ల రూపాయిల నష్టం అన్నమాట.

ఒక సూపర్ హిట్ టాక్ వచ్చిన సినిమాకి ఇంత దారుణమైన కలెక్షన్స్ రావడం..వారం తిరిగే లోపు క్లోసింగ్ కూడా పడిపోవడం ఇది వరుకు ఎప్పుడు కూడా జరగలేదు..అయితే ఈ సినిమా ఓవర్సీస్ లో మాత్రం ఇంకా రన్ అవుతూనే ఉంది..ఇప్పటి దాకా ఈ సినిమా ఇక్కడ 1 మిలియన్ డాలర్లు వసూలు చేసింది..ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కు 13 లక్షల డాలర్లు కాగా ..ఈ వీకెండ్ లో రికార్ అయ్యే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం..ఈ సినిమా కి వసూళ్లు రాకపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి అని ట్రేడ్ లో వినిపిస్తున్న వార్త..అందులో ముందుగా చెప్పుకోవాల్సింది OTT..ఇటీవల కాలం లో ఒక సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయినా కూడా రెండు మూడు వారాలకే OTT లో వచ్చేస్తుంది..దీనితో కుటుంబానికి వెయ్యి రూపాయిలు ఖర్చు పెట్టి థియేటర్ కి పోవడం ఎందుకు దందాగా అనే అభిప్రాయం ఫామిలీ ఆడియన్స్ లో నెలకొంది..పైగా ఇటీవల కాలం లో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు వచ్చాయి ..జనాలందరూ ఈ సినిమాలకు ఎక్కువ డబ్బులు ఖర్చు చెయ్యడం తో నాని సినిమాని లైట్ తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఏది ఏమైనా ఒక మంచి సినిమాని జనాలు థియేటర్స్ లో చూడకుండా మిస్ చేసుకున్నారని ఇండస్ట్రీ లో పెద్దలు బాధ పడుతున్నారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…