Home Entertainment అంటే సుందరానికి ఫుల్ HD మూవీ ఎక్సక్లూసివ్ గా మీకోసం

అంటే సుందరానికి ఫుల్ HD మూవీ ఎక్సక్లూసివ్ గా మీకోసం

6 second read
0
0
9,719

న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన అంటే సుందరానికి సినిమా ఇటీవలే విడుదల అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకొని కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచిన సంగతి మన అందరికి తెలిసిందే..చాలా కాలం తర్వాత నాని లాంటి హీరో నుండి వస్తున్నా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా కావడం తో ఈ మూవీ కచ్చితంగా బాగా ఆడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేసాయి..కానీ వారి అంచనాలను తలక్రిందులు చేసింది ఈ సినిమా..పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఎందుకు ఈ సినిమా సరిగా ఆడలేదు అనే దానిపై ఆరాలు తీస్తే OTT కాలం లో సరైన సాంగ్స్ లేకపోతే ఇలాంటి గతి పట్టక తప్పదని సినీ విశ్లేషకులు చెప్తున్న మాట.. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయినా కూడా రెండు మూడు వారాల్లోనే OTT లో విడుదల అయిపోతున్న ఈ రోజుల్లో జనాలు థియేటర్స్ కి కదిలి రావాలంటే కచ్చితంగా వాళ్ళని ఆకర్షించే విధంగా టీజర్ మరియు ట్రైలర్ కట్స్ ఉండాలి..అంటే సుందరానికి సినిమా వీటిలో విఫలం అవ్వడం వల్లే బాక్స్ ఆఫీస్ ఫలితం అలా వచ్చింది అని తెలుస్తుంది.

థియేట్రికల్ పరంగా ఈ సినిమా ఆశించిన స్థాయి ఫలితం అందుకోలేకపోయినప్పటికీ కూడా డిజిటల్ పరంగా ఈ సినిమాకి మంచి డిమాండ్ ఉంది అనే చెప్పాలి..ఈ సినిమా OTT హక్కులను నెట్ ఫ్లిక్స్ వారు దాదాపుగా 15 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసారు..సినిమా థియేటర్స్ లో విడుదలైన ఆరు వరాల తర్వాతే OTT లో విడుదల చెయ్యాలనే అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు..కానీ ఈ సినిమా థియేట్రికల్ రన్ అన్ని చోట్ల దాదాపుగా క్లోసింగ్ కి వచ్చేసింది..ఒక్క ఓవర్సీస్ లో మినహా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి డైలీ షేర్స్ రావడం ఆగిపోయాయి..దీనితో అనుకున్న దానికంటే ముందు ఈ సినిమాని OTT లో విడుదల చేస్తే మరో 10 కోట్ల రూపాయిలు అదనంగా ఇస్తామని నెట్ ఫ్లిక్స్ వారు నిర్మాతలకు భారీ ఆఫర్ ఇచ్చారట..ఈ సినిమాకి 30 కోట్ల రూపాయిల థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే ఫుల్ రన్ లో 20 కోట్ల రూపాయిలు మాత్రమే వచ్చాయి..అంటే దాదాపుగా 10 కోట్ల రూపాయిలు నష్టం వాటిల్లింది అన్నమాట..ఈ పది కోట్ల రూపాయిల నష్టాన్ని నెట్ఫ్లిక్స్ వారు ఇస్తాము అనడం తో ఆ ఆఫర్ కి నిర్మాతలు ఒప్పుకున్నట్టు తెలుస్తుంది.

దీనితో ఆరు వారల తర్వాత విడుదల అవ్వాల్సిన ఈ సినిమా ఈ నెల చివరి వారం లో అందుబాటులోకి రాబోతుంది..ఎంతోమంది ప్రేక్షకులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు OTT లోకి వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు..ఎందుకంటే ఫామిలీ ఆడియన్స్ ఎవ్వరు కూడా ఈ సినిమాని థియేటర్స్ లో చూడలేదు..వాళ్ళందరూ OTT కోసం ఎదురు చూస్తున్నారు..దాంతో అంటే సుందరానికి సినిమా OTT లో బంపర్ హిట్ అవుతుంది అని నెట్ ఫ్లిక్స్ సంస్థ వారి అంచనా అట..చూడాలి మరి థియేటర్స్ లో సరిగా ఆడని ఈ సినిమా OTT లో అయినా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంటుందో లేదో అనేది..ఇది ఇలా ఉండగా నాని ప్రస్తుతం దసరా అనే సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..నాని కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ పై ఆయన అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు..మరి వారి అంచనాలను ఈ సినిమా అందుకుంటుందో లేదో చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

బ్రేకింగ్ : విడాకులు తీసుకున్న నిహారిక కొణిదెల – చైతన్య..గుండెలు పగిలేలా ఏడుస్తున్న నాగబాబు

ఈమధ్య కాలం లో సెలెబ్రిటీలు విడాకులు తీసుకోవడం సర్వసాధారణం అయిపోయింది.సమంత – నాగ చైతన…